Sri Simha: మహేష్ – రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన కీరవాణి కొడుకు!

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. కె.ఎల్. నారాయణ్ అండ్ ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆర్. ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ ఇది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంటర్నేషనల్ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ ఈ మూవీ రూపొందనుంది. రాజమౌళి …ఆర్.ఆర్.ఆర్ తర్వాత తాను చేయబోయే సినిమా మహేష్ బాబుతో అని చెప్పారు.

అంతకు మించి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అంటూ ఏమీ రాలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా అలా ఉండబోతుంది.. ఇలా ఉండబోతుంది అంటూ చెప్పి ఊరిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా..ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి తనయుడు (Sri Simha) సింహా కోడూరి తన బాగ్ సాలే సినిమా ప్రమోషన్స్ లో స్పందించాడు.’ మహేష్ బాబు గారితో పనిచేయడానికి మా ఫ్యామిలీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం మొదటి స్టేజిలో ఉంది.

స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రైట్ టైంలో ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. ‘ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులకు సింహా మంచి అప్డేట్ ఇచ్చినట్టైంది. ఇక మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధా కృష్ణ ( చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus