Sri Simha Koduri: ఘనంగా కీరవాణి కొడుకు సింహా పెళ్ళి.. ఫోటోలు వైరల్!

ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కొడుకు సింహా కోడూరి అందరికీ తెలుసు. యమదొంగ, మర్యాద రామన్న.. వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుకుమార్- రామ్ చరణ్..ల రంగ స్థలం సినిమాకి కూడా పని చేశాడు. ఇక 2019 లో మత్తు వదలరా సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. అది విజయం సాధించింది. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ ‘భాగ్ సాలె’ వంటి సినిమాల్లో నటించాడు.

Sri Simha Koduri

అవి ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మత్తు వదలరా2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక మరోపక్క సింహా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. సింహా కోడూరి వివాహం సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో ఘనంగా జరిగింది. వీరి వివాహం డెస్టినేషన్‌ వెడ్డింగ్ గా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని Ras Al Khaimahలో నిన్న అంటే డిసెంబర్ 14న రాత్రి జరిగింది.

వీరి పెళ్లి వేడుకకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ పరిశ్రమకి చెందిన వారు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రాజమౌళి డాన్స్ చేసిన వీడియో పెద్ద ఎత్తున హల్ చల్ చేసింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సింహా కోడూరి, రాగ ..ల పెళ్ళి ఫోటోలు మీరు కూడా ఒకసారి చూసేయండి :

మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus