గత వారం ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ‘డియర్ మేఘ’ వంటి క్రేజీ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా కనీసం వసూళ్లను రాబట్టలేదు. అయితే అంతకుముందు వారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్న సుధీర్ బాబు,ఆనంది ల ‘శ్రీదేవి సోడా సెంటర్’ బాగానే పెర్ఫార్మ్ చేసింది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్ల వివరాలను గమనిస్తే :
నైజాం
1.52 cr
సీడెడ్
0.76 cr
ఉత్తరాంధ్ర
0.67 cr
ఈస్ట్
0.41 cr
వెస్ట్
0.24 cr
గుంటూరు
0.45 cr
కృష్ణా
0.25 cr
నెల్లూరు
0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.12 Cr
ఓవర్సీస్
0.26 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.84 cr
‘శ్రీదేవి సోడా సెంటర్’ కు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.కానీ 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.36 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10వ రోజున ఈ చిత్రం రూ.0.36 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదే విధంగా మరో వారం పెర్ఫార్మ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ సెప్టెంబర్ 10న ‘సీటీమార్’ థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్లో ‘టక్ జగదీష్’ రిలీజ్ కాబోతుంది కాబట్టి అది కష్టమనే చెప్పాలి.