తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా శ్రీదేవి విజయ్ కుమార్ కు (Sridevi Vijaykumar) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. శ్రీదేవి విజయ్ కుమార్ పెళ్లి తర్వాత సినిమాలలో ఎక్కువగా నటించలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి అందుకు గల కారణాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. నా భర్త అయితే సినిమాలు చేయాలని ప్రోత్సహించాడని ఆమె వెల్లడించారు. ప్రతిభ ఉంది ఇష్టం ఉంది సినిమాలు ఎందుకు చేయట్లేదని చాలామంది అడిగేవారని శ్రీదేవి పేర్కొన్నారు.
కానీ మ్యారేజ్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టడంతో అలవాటు పడటానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల వయస్సులో నేను సినిమాల్లోకి వచ్చానని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదని శ్రీదేవి వెల్లడించారు. మ్యారేజ్ తర్వాత సినిమాలకు సంబంధించి అనుకోకుండానే గ్యాప్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కానీ ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నానని శ్రీదేవి వెల్లడించారు.
శ్రీదేవి విజయ్ కుమార్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈశ్వర్ (Eeswar), నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లి కాని ప్రసాద్, నిరీక్షణ మరికొన్ని సినిమాలలో ఆమె నటించారు. 2009 సంవత్సరంలో రాహుల్ అనే వ్యక్తితో శ్రీదేవి వివాహం జరిగింది. 2011 సంవత్సరంలో వీర అనే సినిమాలో నటించిన శ్రీదేవి కొన్నేళ్ల క్రితం ఒక కన్నడ సినిమాలో మెరిశారు. బ్యాగ్రౌండ్ కు ప్రతిభ, అందం తోడు కావడంతో ఇప్పటికీ జూనియర్ శ్రీదేవికి ఆఫర్లు వస్తున్నాయి.
జూనియర్ శ్రీదేవి (Sridevi Vijaykumar) రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ శ్రీదేవి వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ శ్రీదేవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించి శ్రీదేవి ఆకట్టుకున్నారు.