దివంగత స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గారు టాలీవుడ్ కు పరిచయం చేసిన గొప్ప నటుల్లో శ్రీహరి కూడా ఒకరు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీహరి.. 100 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరో ఆయన 28 సినిమాల్లో నటించారు. శ్రీహరి హీరోగా నటించిన చివరి సినిమా ‘పోలీస్ గేమ్’ . విజయవాడకు చెందిన శ్రీహరి కుటుంబం.. అతని చిన్నతనంలోనే హైదరాబాద్ లోని బాలానగర్ లో సెటిల్ అయ్యారు.
ఇక 2013 అక్టోబర్ 9 న శ్రీహరి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇదిలా ఉండగా.. శ్రీహరికి తమ్ముడు కూడా ఉన్నాడు.. అతను నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అన్న విషయం చాలా మందికి తెలీదు. అందుకు కారణం అతనికి సరైన గుర్తింపు లభించకపోవడం. శ్రీహరి తమ్ముడి పేరు శ్రీధర్. ఈయన సినిమాల్లో ఫైటర్ గా కనిపిస్తుంటారు. అయితే ఎట్టకేలకు ఈయనకు అరుదైన గౌరవం దక్కింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డ్ అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వందకు పైగా సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా సినిమాలు రూపొందించారు. ఇక ఈ పదవిలో శ్రీధర్.. రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ స్పందిస్తూ… “నాకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తాను,
ఈ సందర్భంగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బి.జె.పి. ప్రెసిడెంట్ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ తెలిపారు.