విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెదకాపు1 సినిమా తాజాగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రావడం లేదు. 48 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఆశించిన రేంజ్ లో లేవు. పెదకాపు సినిమాకు ఆ టైటిల్ మైనస్ అయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెదకాపు1 టైటిల్ వల్ల చాలామంది ఈ సినిమా ఏదో కులాలకు సంబంధించిన సినిమా అనే అభిప్రాయం కలిగిందని చెబుతున్నారు. పెదకాపు అనే టైటిల్ కులానికి సంబంధించినది కాదని శ్రీకాంత్ అడ్డాల చెబుతూనే ఉన్నా చాలామంది మాత్రం ఈ సినిమా విషయంలో అభిప్రాయాన్ని మార్చుకోలేదు. మరోవైపు స్కంద, చంద్రముఖి2 సినిమాలకు పోటీగా రిలీజ్ కావడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.
పెదకాపు1 సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. పెదకాపు1 సినిమాకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం కూడా మైనస్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెదకాపు1 సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా కథ, కథనం విషయంలో చేసిన పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అవుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెదకాపు1 (Peddha Kapu) సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు అయితే దాదాపుగా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శ్రీకాంత్ అడ్డాలకు ఎవరు ఆఫర్ ఇస్తారనే ప్రశ్నకు సంబంధించి కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. శ్రీకాంత్ అడ్డాలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాలకు మాస్ సినిమాల కంటే క్లాస్ సినిమాలే బెస్ట్ అని నెటిజన్లు చెబుతున్నారు.