దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని (Srikanth AddalaSrikanth Addala) ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని టాప్ హీరోగా ఎదిగాడు. అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్(Varun Tej) ను హీరోగా లాంచ్ చేస్తూ చేసిన ‘ముకుంద’ (Mukunda) ప్లాప్ అయ్యింది. అటు తర్వాత చేసిన ‘బ్రహ్మోత్సవం’ (Brahmotsavam) పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. వాస్తవానికి ఈ రెండు సినిమాల కథలు బాగుంటాయి.
కానీ స్క్రిప్ట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లో ఏమో.. ఎడిటింగ్ పార్ట్ వరస్ట్ గా ఉంటుంది అని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ శ్రీకాంత్ ను పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు వెంకటేష్ (Venkatesh). అలా చేసిన ‘నారప్ప’ (Narappa) థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేదు. ఓటీటీకే పరిమితమైంది. ఇక ‘అఖండ’ (Akhanda) నిర్మాతతో చేసిన ‘పెదకాపు -1’ (Peddha Kapu 1) కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో శ్రీకాంత్ చాలా కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మధ్యలో కన్నడ స్టార్ హీరో దర్శన్ కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.
కానీ ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయిన కొద్ది రోజులకే దర్శన్ మర్డర్ కేసులో జైలు పాలయ్యాడు. అందువల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇటీవల దిల్ రాజుకి (Dil Raju) ఒక కథ చెప్పి ఇంప్రెస్ చేసాడట శ్రీకాంత్. ‘కూచిపూడి వారి వీధి’ అనేది దీని టైటిల్. ఇది అక్కాచెల్లెళ్ల కథ అని సమాచారం. ఈ పాత్రలకి సరిపడే ఇద్దరు హీరోయిన్లు దొరికితే సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. కానీ శ్రీకాంత్.. నటీనటుల విషయంలో ఓ పట్టాన కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. మరి ఈ పాత్రలకి ఎవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి.