కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) అందరికీ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా ఇతను పాపులర్ అయ్యాడు, హీరో అయ్యాడు. ‘విజేత’ ‘కిన్నెరసాని’ ‘సూపర్ మచ్చి’ వంటి సినిమాల్లో నటించాడు. కానీ అవి ఇతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఇతను సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కళ్యాణ్ దేవ్. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆ పోస్టులో ‘నిన్ను చూసి నెల రోజులు అవుతుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నవిష్క అంటూ ఓ సాడ్ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘అంటే తండ్రి వద్దకు కూతుర్ని ఇన్ని రోజులు పంపలేదా?’ అంటూ కొందరు.. ‘తప్పకుండా కలుసుకుంటారులే అన్నా’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్, శ్రీజ 2016 లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా కలిసున్నారు.
వీరికి నవిష్క అనే పాప కూడా జన్మించింది. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు అనే టాక్ నడిచింది. కానీ దీనిపై అటు కళ్యాణ్ కానీ ఇటు శ్రీజ కానీ స్పందించింది లేదు. బహుశా శ్రీజ.. సినిమాల్లో లేదు కాబట్టి.. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వలేదేమో అని అంతా అనుకున్నారు. అయితే పాపని మాత్రం వారానికి ఒకరోజు కళ్యాణ్ (Kalyan Dev) వద్దకి పంపుతున్నారట శ్రీజ అండ్ ఫ్యామిలీ. మరి ఈసారి ఎందుకు పంపలేదు అనేది తెలియాల్సి ఉంది.