నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma), శైలేష్ కొలను (Sailesh Kolanu) వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ని పరిచయం చేసింది నానినే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే శ్రీకాంత్ ఓదెలని (Srikanth Odela) డైరెక్టర్ గా పెట్టి చిరంజీవితో (Chiranjeevi) కూడా ఓ సినిమా నిర్మించబోతున్నాడు నాని. మరోపక్క యంగ్ టాలెంట్ ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రియదర్శిని (Priyadarshi Pulikonda) హీరోగా పెట్టి ‘కోర్ట్’ (Court) అనే సినిమా చేశాడు నాని.
ఇది కోర్ట్ డ్రామానే. పైగా చిన్న సినిమా. పూర్తిగా కంటెంట్ బేస్ పై సాగుతుంది. ఫోక్సో చట్టం గురించి ఇటీవల చాలా మంది వినే ఉంటారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అరెస్ట్ అయ్యింది ఈ కేసులోనే. ‘కోర్ట్’ కథ మొత్తం దాని గురించే ఉంటుందట. చాలా తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని తీసేశారు. రామ్ జగదీష్ దర్శకుడు.
ఇక ‘కోర్ట్’ చిత్రం ఇలా షూటింగ్ కంప్లీట్ చేసుకుందో లేదో.. అప్పుడే ఓటీటీ డీల్ కూడా ఫినిష్ అయిపోయిందట. అవును.. నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘కోర్ట్’ చిత్రం డిజిటల్ హక్కులను రూ.9 కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాకి బడ్జెట్ రూ.7 కోట్ల లోపే ఉందట. అందువల్ల డిజిటల్ రైట్స్ తోనే ఈ సినిమా సేఫ్ అయిపోయినట్టే అని వినికిడి. ఇంకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి.
సో వాటి రూపంలో వచ్చేదంతా లాభమే అనమాట. ప్రియదర్శి హీరోగా చేసిన సినిమాలు చాలా వరకు సేఫ్ అయిపోతున్నాయి. ‘మల్లేశం’ (Mallesham) ‘బలగం’ (Balagam) వంటి సినిమాలు విజయాలు సాధించాయి. ‘డార్లింగ్’ సినిమా ప్లాప్ అయినా దానికి నిర్మాత నష్టపోలేదు అని వినికిడి.