Srikanth: వారసుడులో నా రోల్ ఇదే.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!

ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న వారసుడు సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కు సోదరుడి పాత్రలో శ్రీకాంత్ నటించగా వారసుడు ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నా సినీ కెరీర్ లో తొలిసారి తమిళ సినిమాలో నటించానని ఈ సినిమాకు నా పాత్ర ఎంతో కీలకమని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని ఎమోషన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పక్కా తెలుగు సినిమా అనే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలుగులో సినిమాలు చేసిన నటీనటులు ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.

సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నేను కనిపిస్తానని శ్రీకాంత్ తెలిపారు. స్టార్ హీరో విజయ్ సెల్ ఫోన్ వాడరని క్యారవాన్ వాడరని విజయ్ చాలా అంకిత భావంతో పని చేస్తారని ప్యాకప్ చెప్పే వరకు ఆయన షూట్ లోనే ఉంటారని శ్రీకాంత్ కామెంట్లు చేయడం గమనార్హం. వంశీ పైడిపల్లి స్పష్టత ఉన్న డైరెక్టర్ అని రాజీ పడకుండా సినిమాను డైరెక్ట్ చేస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. చరణ్ శంకర్ కాంబో మూవీలో విభిన్నమైన రోల్ లో కనిపిస్తానని ఆయన కామెంట్లు చేశారు.

సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీకాంత్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారసుడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus