Devara Movie: దేవర సినిమాలో శ్రీకాంత్ అలా కనిపించబోతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా 2024 బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో నటించినటువంటి నటులలో ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దేవర సినిమా స్టోరీ మొత్తం లీక్ చేశారనే చెప్పాలి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ దగ్గర ఉండే వ్యక్తిగా కనిపిస్తానని తెలిపారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఏంటి అనే విషయం గురించి కూడా యాంకర్ ప్రశ్నించడంతో ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉండబోతుందని ఈయన హీరోయిన్ జాన్వీ కపూర్ కి తండ్రి పాత్రలో నటించబోతున్నారు అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ పాత్ర గురించి వెల్లడించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది తప్పకుండా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చాలా అద్భుతంగా వస్తుందని ఇక ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది అంటూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ పది పేపర్లు డైలాగ్స్ ఉన్నా కూడా సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసుకుంటారు అలా వస్తారు టకటక తన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు ఇక డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఇలా చించి అలా పడేస్తారు అంటూ ఎన్టీఆర్ నటన గురించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/vardhanEdits/status/1741193836779704785?s=20

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus