బూస్ట్.. ఈ మాట వినగానే రెండు విషయాలు గుర్తొస్తాయఒకటి క్రికెటర్స్ చేసే యాడ్స్, రెండు శ్రీనివాసరెడ్డి కామెడీ.. ఈ ఒక్క డైలాగ్ తోనే అంత ఫేమ్ అయ్యాడతను టాలెంట్ అనే నమ్మకంపై టైమింగ్ అనే ఆయుధంతో సినీ కదన రంగంలోకి దూకిన కుర్రాడు శ్రీనివాస్ రెడ్డి.. ఒక్క ఛాన్స్ లాంటి మాటలు అతని కెరీర్ లో చాలానే ఉన్నాయి.. అయినా చిన్నప్పుడు నేర్చుకున్న మిమిక్రీని ఆలంబనగా చేసుకునిముందు బుల్లితెరపై అరంగేట్రం చేశాడు..అటుపై పట్టుదలతో ప్రయత్నించి వెండితెర కలను సాకారం చేసుకున్నాడు.. పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఛాన్స్ ను ఇడియట్ సినిమాలో బూస్ట్ అనే డైలాగ్ తో ఉపయోగించుకుని తన కెరీర్ కు తనే బూస్టప్ తెచ్చుకున్నాడు..ఒక్కో సినిమానూ పేర్చుకుంటూ కమెడియన్స్ కు కల్పతరువు లాంటి టాలీవుడ్ లో తనూ ఓ స్టార్ గా ఎదిగాడంటే దానికి కారణం అతని టైమింగే.. అదే అతని టైమ్ ను మార్చింది… ఈ టైమ్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఓ సినిమాలో బ్రహ్మానందాన్ని కొట్టే పాత్ర ఉంటేఅందుకు శ్రీనివాసరెడ్డే కరెక్ట్ అని దర్శకుడే ఫీలయ్యేంత వరకు… ఇన్ స్టంట్ సెటైర్.. ఇమ్మీడియట్ రియాక్షన్ శ్రీనివాసరెడ్డి బలం.