Srinivas Reddy: నావల్ల నా స్నేహితుడు ఇండస్ట్రీకి దూరమయ్యారు: శ్రీనివాస్ రెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా నటించి తన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. కెరియర్ మొదట్లో శ్రీనివాస్ రెడ్డి పలు సీరియల్స్ లో కూడా నటించేవారని సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో అన్ని విభాగాలలో పని చేస్తూ తనని తాను నిరూపించుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఒకసారి ఈయన బైక్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.

ఆ సమయంలో ఈయన కాలికి పూర్తిగా దెబ్బ తగలడంతో ఇప్పటికి సరిగా కూడా నడవలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రమాద ఘటన గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాలేరు సమీప ప్రాంతంలో కేశవాపురం వద్ద తన ఫ్రెండ్‌, సహ-నటుడు శివతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో తనతో పాటు తన స్నేహితుడికి కూడా కాలు విరిగిందని ఈయన తెలియజేశారు.

అయితే ఈ ప్రమాదం కారణంగా నా స్నేహితుడు శివ ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉపయోగించారు. ఈ మెడిసిన్ కారణంగా ఆయన పూర్తిగా సోరియాసిస్ బారిన పడాల్సి వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇలా తనకు సోరియాసిస్ ఎక్కువ కావడంతో ఏ దర్శకుడు కూడా తనని సినిమాలలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే సీరియల్ అవకాశాలు కూడా ఏమాత్రం రాలేదని తెలిపారు.

దీంతో ఆయన సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారని కేవలం నా కారణంగానే తన కెరియర్ దెబ్బతినిందని శ్రీనివాస్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఇక నేను ఎవరికైనా ఏదైనా చేయాలి అనుకుంటే అది ముందుగా శివకే చేయాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా తన వల్ల తన స్నేహితుడు కోల్పోయిన కెరియర్ గురించి ఈయన (Srinivas Reddy) ఎమోషనల్ అయ్యారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus