తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిభింబించే సినిమాలు అతితక్కువగా వస్తుంటాయి. అటువంటి వాటిలో “శ్రీనివాస కళ్యాణం”ఒకటి. నితిన్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 9 న రిలీజ్ అయి మిశ్రమస్పందన అందుకుంది. శతమానం భవతి తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో డైలాగులు మహిళల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 2 .77 కోట్ల కలక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. తొలి రోజు వసూళ్ల పరంగా శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ కెరీర్ లో రెండవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. నైజాం ఏరియాలో అత్యధికంగా 1.17 కోట్ల షేర్ తొలిరోజు రాబట్టింది. అదే విధంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా 8.5 కోట్ల షేర్ ను రాబట్టింది.
యూఎస్ లోను ఈ చిత్రానికి ఆదరణ బాగుంది. తొలిరోజు 20 లక్షలు వసూలు చేసిన మూవీ నాలుగురోజుల్లో 75 లక్షలను రాబట్టింది. ఇక్కడ, అక్కడ ఈరోజు, రేపు కలక్షన్ల జోరు కొనసాగించనుందని ట్రేడ్ వర్గాల వారు చెప్పారు. ఆగస్టు 15 న విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన “గీత గోవిందం” థియేటర్లకు రానుంది. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇది హిట్ టాక్ సొంతం చేసుకుంటే శ్రీనివాస కళ్యాణం కలక్షన్స్ పడిపోతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.