బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌కు ఫ్లాప్‌ల డైరక్టర్‌.. రిస్క్‌ చేస్తు్న్నారా?

మరో టాలీవుడ్‌ డైరక్టర్‌ బాలీవుడ్‌ బాట పట్టబోతున్నారు. అయితే ఆ సినిమా నిర్మాతలు తెలుగువారే కావడం గమనార్హం. ఈ సినిమా సీక్వెల్‌ కావడంతో వారు బాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. మామూలుగా అయితే ఇది నార్మల్‌ వార్తే. కానీ ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాను ఫ్లాప్ల డైరక్టర్ హ్యాండిల్‌ చేస్తారనే వార్త బయటకు రావడమే సమస్య. ఆ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య కాగా.. ఆ సినిమా ‘జాట్‌’. ఇక నిర్మాణ సంస్థలు ఏంటో మీకు తెలిసిపోయుంటుంది. ఒకటి మైత్రీ మూవీ మేకర్స్‌ కాగా, మరొకటి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ.

Sriram Adittya

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్‌ కలసి.. సన్నీ డియోల్‌ హీరోగా ‘జాట్’ అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సమ్మర్‌లో వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయట. అయితే బాలకృష్ణ సినిమాతో గోపీచంద్‌ మలినేని బిజీగా ఉండటంతో సీక్వెల్‌ పనులను వేరే దర్శకుడికి అప్పజెప్పే ఉద్దేశంలో ఉన్నారట.

అలా శ్రీరామ్‌ ఆదిత్య పేరు చర్చలోకి వచ్చిందని సమాచారం. ఆయన తన గత సినిమా ‘మనమే’ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలోనే తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ పరిచయం, అప్పటి అంగీకారాల నేపథ్యంలో ఈ సినిమాను ఓకే చేశారని సమాచారం. శ్రీరామ్‌ ఆదిత్య ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక్కోటి ఒక్కో జోనర్‌. ‘మనమే’లో హ్యూమన్‌ ఎమోషన్స్‌ డీల్‌ చేయగా.. ‘హీరో’, ‘దేవదాస్‌’ మాస్‌ యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కించారు.

ఇక ‘శమంతకమణి’, ‘భలే మంచి రోజు’ సినిమాలు దాదాపుగా ఒకే జోనర్‌లో ఉంటాయి. మరిప్పుడు పూర్తి యాక్షన్‌ మోడ్‌లో ఉండే ‘జాట్‌’ సినిమా సీక్వెల్‌ను శ్రీరామ్‌ ఆదిత్య ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే అందులో రివేంజ్‌, యాక్షన్‌ భారీ స్థాయిలో ఉంటాయి. చూద్దాం మరి ఈ జోనర్‌ అయినా మంచి ఫలితం ఇస్తుందేమో.

మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus