“దేవ‌దాస్” సినిమా అలా రావడం వెనుక కారణం వారేనట!

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని తొలిసారి కలిసి నటించిన మూవీ దేవదాస్. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురువారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. నాని, నాగ్ కలిసి నవ్వులు పూయించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుడికి అక్కడక్కడా జర్క్ లు వచ్చినట్టుగా అనిపిస్తుంటాయి. అది కథకి ఇబ్బంది కలిగించలేదు కానీ.. ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలిగింది. ఇలా రావడానికి కారణం హీరోలేనని ఫిలిం నగరవాసులు చెప్పుకుంటున్నారు. సినిమా తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో ఎడిటింగ్ దగ్గర అంతే జాగ్రత్తగా ఉండాలి. లేకుండా కథలే మారిపోతుంటాయి.

అందుకే ఎడిటింగ్ సమయంలో కూడా వచ్చి చూసుకుంటూ ఉంటారు. ఇక మల్టీ స్టారర్ మూవీ అయితే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటాయి. ఒక హీరో నటించిన సీన్లు ఎక్కువగా.. మరొకరు నటించిన సీన్లు తక్కువగా వచ్చే ఆస్కారం కూడా ఉంది. అందుకే దేవదాస్ సినిమా ఎడిటింగ్ సమయంలో నాని, నాగార్జున దగ్గరుండి చేసుకున్నారట. నాని వ‌చ్చి కొన్ని మార్పులు చెప్పి వెళ్లిపోయేవాడ‌ట‌. ఆ త‌ర‌వాత నాగ్ వ‌చ్చి..’ అలా కాదు.. ఇలా మార్చండి’ అనేస‌రికి ఆ మార్పులు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేవ‌ని తెలిసింది. చివ‌ర్లో ద‌ర్శ‌కుడు రంగంలోకి దిగి..”ఈ షాట్లు పెట్టండి”’ అనే స‌రికి సినిమా మ‌రో రూపంలోకి వెళ్లేపోయేద‌ని సమాచారం. వీరు ముగ్గురే కాకుండా ఆశ్వ‌నీద‌త్‌, ప్రియాంక, స్వ‌ప్న‌ దత్ లు కూడా ఎడిటింగ్ లో చేయి పెట్టారని.. అందుకే మూవీలో అక్కడక్కడ జంప్ కట్స్ కనిపించాయని చిత్ర బృందంలో కొందరు అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus