‘మా’ పరువును గంగపాలు చేశారంటున్న శ్రీరెడ్డి!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికలు, ఎన్నికల ఫలితాలకు సంబంధించిన రచ్చ మాత్రం కొనసాగుతోంది. తాజాగా శ్రీరెడ్డి ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయగా నరేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం కోసం ఆందోళన చేసిన సమయంలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వలేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

ఆ సమయంలో తన కన్నీటిని ఎవరూ తుడవలేదని శ్రీరెడ్డి అన్నారు. ఇప్పుడు మాత్రం రోడ్లపైకి వచ్చి తమకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నారని శ్రీరెడ్డి చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సేవ చేస్తామని చెబుతున్నారని ఎవరు చేస్తే ఏంటి? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వేసిన ఎత్తులు పారలేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడుపులు ఎందుకు? అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల గురించి శ్రీరెడ్డి ప్రశ్నించారు.

సంవత్సరాలుగా కొనసాగిన ఆధిపత్యం పోవడంతో మెగా ఫ్యామిలీ హీరోలు ఏడుస్తున్నారని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు. నాగబాబు, హేమ, జీవిత తనను ఏడిపించారని శ్రీరెడ్డి పేర్కొన్నారు. తనను ఏడిపించిన వాళ్లు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువును గంగపాలు చేశారని శ్రీరెడ్డి తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కమ్మ కాపు కులాల ఫీలింగ్ బాగా వచ్చిందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థానంను భర్తీ చేసే అర్హత మోహన్ బాబుకు మాత్రమే ఉందని శ్రీరెడ్డి వెల్లడించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus