Sriya Reddy: ఆ మూవీ కథ గందరగోళంగా ఉంటుంది.. శ్రియారెడ్డి ఏమన్నారంటే?

సలార్ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్లలో శ్రియారెడ్డి ఒకరు. రాధారమా మన్నార్ పాత్రకు జీవం పోసిన శ్రియారెడ్డి తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒక సందర్భంలో శ్రియారెడ్డి మాట్లాడుతూ పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాలపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి శ్రియారెడ్డి ఈ తరహా కామెంట్లు చేయడం గమనార్హం.

అమ్మతోడు.. పొన్నియన్ సెల్వన్ కథ నాకు అర్థం కాలేదని ఆమె తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాలు తమిళనాట సక్సెస్ సాధించినా తెలుగునాట ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. తెలుగులో పొన్నియిన్ సెల్వన్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

సలార్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న శ్రియారెడ్డి సలార్2 సినిమాలో తన పాత్ర నిడివి మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సుజీత్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో సైతం ఆమె నటిస్తున్నారు. ఓజీ రిలీజ్ తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. శ్రియారెడ్డి పారితోషికం సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రియారెడ్డికి (Sriya Reddy) సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆమె సత్తా చాటుతున్నారు. శ్రియారెడ్డికి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు సొంతం కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రియారెడ్డిని అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. శ్రియారెడ్డి తెలుగులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమె ఇండస్ట్రీలోనే కొనసాగాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus