Sriya Reddy: ఆ హీరో సైలెంట్ అని చెబుతున్న శ్రియారెడ్డి.. ఏం జరిగిందంటే?

సలార్ సినిమాలో రాధా రమ మన్నార్ పాత్ర ద్వారా శ్రియారెడ్డి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. సలార్ రిలీజ్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రియారెడ్డి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ సలార్ గురించి చెప్పిన సమయంలో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని శ్రియారెడ్డి అన్నారు. అప్పటికే నేను సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. అయితే ప్రశాంత్ నీల్ నన్ను ఆ సినిమాలో ఎలాగైనా నటింపజేయాలని పట్టుబట్టారని సలార్ స్క్రిప్ట్ విని సమాధానం చెప్పమన్నారని శ్రియారెడ్డి పేర్కొన్నారు.

సలార్ మూవీ కథ నచ్చడంతో నేను వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పానని శ్రియారెడ్డి కామెంట్లు చేశారు. స్క్రిప్ట్ లో మొదట నా రోల్ లేదని కథలోకి లోతుగా వెళ్లే క్రమంలో నా పాత్రను డిజైన్ చేశారని ఆమె అన్నారు. పొగరు సినిమా వల్లే ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని శ్రియారెడ్డి పేర్కొన్నారు. సలార్ ఫస్ట్ పార్ట్ లో కథను పరిచయం చేసే ప్రయత్నం చేశామని ఆమె అన్నారు. సలార్2 మరో స్థాయిలో ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

రెండో భాగంలో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని శ్రియారెడ్డి కామెంట్లు చేశారు. ప్రభాస్ స్వీట్ పర్సన్ అని ఎప్పుడూ కూల్ గా ఉంటారని పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్కువగా మాట్లాడరని శ్రియారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ స్టోరీ బాగుందని ఓజీలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుందని శ్రియారెడ్డి కామెంట్లు చేశారు.

ఓజీ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఓజీ మూవీలో నెగిటివ్ రోల్ లో నటించడం లేదని శ్రియారెడ్డి కామెంట్లు చేశారు. ఓజీలో నా (Sriya Reddy) రోల్ విభిన్నమైన రోల్ అని ఆ సినిమా గురించి ఇంతకు మించి చెప్పలేనని ఆమె తెలిపారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus