అర్జున్ వలెనే నాకు ఆఫర్లు రావట్లేదు..

‘మీటూ’ ఉద్యమంలో భాగంగా అర్జున్ సార్జా పై లైంగిక ఆరోపణలు చేసింది కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్. అలాచేయడం వలనే తన కెరీర్ ను నాశనం చేసారని చెప్తుంది శృతి. వివరాల్లోకి వెళితే తెలుగు ,తమిళ , కన్నడ భాషల్లో అర్జున్ సార్జాకి మంచి క్రేజ్ వుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటి అర్జున్ ఒక సినిమా షూటింగ్ టైం లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ గతంలో ఆరోపణలు చేసింది. తరువాత ఆ ఆరోపణలను అర్జున్ ఖండించడం కూడా జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అర్జున్ చెప్పుకొచ్చాడు. తరువాత ఈ విషయం పై ఎటువంటి చర్చ లేదు. అయితే ఇటీవల మరోసారి శ్రుతి హరిహరన్ ఈ విషయం గురించి ప్రస్తావించింది.

శృతి హరిహరన్ మాట్లాడుతూ “అర్జున్ పై ఆరోపణలు చేయడం వలన నాకు ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు…. అప్పట్లో రెండు.. మూడు ఆఫర్లతో నిర్మాతలు నన్ను సంప్రదించేవారని …. అయితే అర్జున్ పై ఆరోపణలు చేసినప్పటి నుండీ ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రావడం లేదని .. నా కెరియర్ నాశనమైపోయిందని చెప్పుకొచ్చింది. దక్షణాది సినీ పరిశ్రమలో తనకున్న పలుకుబడితో నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడని” తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus