తెలుగు సినిమాను భారతీయ సినిమా స్టైల్‌కు పెంచినా… భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటినా … ఆ ఘనత ఇటీవల కాలంలో రాజమౌళికే దక్కిందని చెప్పాలి. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో ‘ఈయన మామూలోడు కాదు’ అని నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన మరో ఘనత సాధించాడు. అయితే ఇది సినిమాలకు సంబంధించి కాకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది జరగబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో రాజమౌళికి కూడా స్థానం దక్కింది. కమిటీలో రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, చిత్ర ప్రముఖులు చాలా మంది ఉన్నారు. చిత్ర ప్రముఖుల్లో రాజమౌళి కూడా ఉండటం గమనార్హం. ఆయనతోపాటు ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ కూడా ఉన్నారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుందట. ఇంతటి కీలక కమిటీలో రాజమౌళి అందరి కంటే జూనియర్‌కావడం విశేషం. వయసులోనూ చిన్నవాడు కావడం గమనార్హం. సినిమాలతో వావ్ అనిపించుకున్న రాజమౌళి.. ఇప్పుడు కమిటీలో ఏం చేస్తారో చూడాలి.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!