‘ఆర్.ఆర్.ఆర్’ లో మహేష్ ను అందుకే తీసుకోలేదు…!

ఇటీవల జరిగిన ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రెస్ మీట్లో దర్శకదీరుడు రాజమౌళికి మీడియా నుండీ ఊహించని ప్రశ్న ఎదురైంది. విషయం ఏమిటంటే ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్… అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నట్టు తెలిపాడు. ఆ చిత్రంలో కృష్ణ గారు ఎంతబాగా నటించారో అందరికీ తెలుసు… ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యింది కూడా. అయితే కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రకి మహేష్ ను ఎందుకు తీసుకోలేదని విలేకరు రాజమౌళిని ప్రశ్నించాడు.

దీనికి రాజమౌళి సమాధానమిస్తూ… ” ‘బిజినెస్ మెన్’ సినిమా ఆడియో రిలీజ్ కి వెళ్ళినప్పుడు… అభిమానులు మహేష్ తో సినిమా ఎప్పుడని అడుగుతున్నప్పుడు …. నేను మహేష్ తో ఎలాంటి సినిమా చేయాలి అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా చేయాలా లేక జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలా లేక కౌబాయ్.. లాంటి సినిమా చేయాలా అని అడిగినప్పుడు మీరు ఒకటి డిసైడ్ అయ్యి చెప్పండి అని అడిగినప్పుడు అల్లూరి సీతారామరాజు కి ఎక్కువ రెస్పాన్స్ రాలేదు… జేమ్స్ బాండ్ అనగానే పెద్ద రెస్పాన్స్ వచ్చింది… సో అదే జరగొచ్చేమో” అంటూ సమాధానమిచ్చాడు రాజమోళి. సో మహేష్ -రాజమౌళి సినిమా అంటూ వస్తే అది జేమ్స్ బాండ్ తరహా లోనే ఉంటుందని రాజమౌళి పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus