SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

రాజమౌళి మహేష్ బాబు (SSMB29) ప్రాజెక్ట్ కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఇండియాలో ఈ “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 130 అడుగుల భారీ స్టేజ్, ‘నో కెమెరా’ రూల్స్‌తో ఈ ఈవెంట్‌పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ, జక్కన్న ప్లానింగ్ కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు.

ఇక్కడే రాజమౌళి తన ‘గ్లోబల్ డైరెక్టర్’ ట్యాగ్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌ను అమెరికా (US)లో ఏకంగా ‘వెరైటీ’ (Variety) లాంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లికేషన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఇది మామూలు విషయం కాదు. ‘వెరైటీ’ హాలీవుడ్ ట్రేడ్ మ్యాగజైన్; అక్కడ ఒక తెలుగు సినిమా టైటిల్ రివీల్‌ను లైవ్ ఇవ్వడం అంటే, జక్కన్న ఈ సినిమాను నేరుగా వెస్ట్రన్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నట్లే. హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి చేస్తున్న ఈ ‘వెరైటీ’ ప్లాన్ లో క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

SSMB29

‘RRR’ తర్వాత రాజమౌళికి గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన గుర్తింపును పూర్తిగా వాడుకోవాలన్నదే ఈ ప్లాన్. ఇది కేవలం ఓవర్సీస్‌లో ఉన్న తెలుగువారి కోసం వేసిన ఎత్తుగడ కాదు. అక్కడి స్థానిక ప్రేక్షకులను, హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆకర్షించడానికే ఈ ‘వెరైటీ’ టై అప్. అమెరికా టైమింగ్స్ ప్రకారం ఉదయం 8:30 (ET) గంటలకు ఈ స్ట్రీమింగ్ ఉండనుంది. ఇది ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది.

ఈ గ్లోబల్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ‘వారణాసి’ అనే టైటిల్ గట్టిగా వినిపిస్తున్నా, ఆ 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై జక్కన్న ఏం పేరు చూపిస్తాడోనని సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండటం కూడా ఈ గ్లోబల్ అప్పీల్‌కు బలం చేకూరుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus