SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

రాజమౌళి సినిమా అంటే వాయిదాలు కన్‌ఫామ్‌. ఆ వాయిదాలు సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలోనే కాదు, సినిమా అప్‌డేట్ల విషయంలోనూ ఉంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన పెద్ద సినిమాల విషయంలో ఈ వాయిదాల పర్వం మనం చూశాం కూడా. ఇప్పుడు మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అవును ఈ నెలలో మహేష్‌బాబు లుక్‌ను రిలీజ్‌ చేస్తామని కొన్ని నెలల క్రితమే రాజమౌళి చెప్పారు. ఈ మేరకు టీజర్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు.

SSMB29

మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో SSRMB లేదా SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌ నిన్న మిడ్‌నైట్‌ రాజమౌళి అండ్‌ కో. షాకిచ్చింది. పక్కాగా ప్లాన్‌ చేసుకొని వరుస ట్వీట్లు చేసి ‘ఈ నెలలో మీరు కోరుకుంటున్న అప్‌డేట్‌ రావడం లేదు’ అని మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి చెప్పేశారు. దీని కోసం ఎక్స్‌లో ఒకరి మెసేజ్‌లకు మరొకరు రిప్లై ఇచ్చారు. అదంతా చూస్తే కావాలని చేశారని అర్థమైపోతుంది. కానీ ఓసారి చూద్దాం మాట్లాడుకున్నారో.
మహేశ్‌ బాబు: రాజమౌళి.. నవంబరు వచ్చేసింది. అప్‌డేట్‌ ఎప్పుడిస్తారు?
రాజమౌళి: అవును కానీ ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావు?
మహేశ్‌ బాబు: మీ డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహాభారత’కి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మీరు నవంబరులో అప్‌డేట్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశారు. మాట నిలబెట్టుకోండి.
రాజమౌళి: ఇప్పుడే కదా సినిమా షూటింగ్‌ మొదలైంది మహేశ్‌. ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దాం.
మహేశ్‌ బాబు: ఎంత నెమ్మదిగా సర్‌. 2030లో అప్‌డేట్స్‌ మొదలుపెడదామా? ప్రియాంకా చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌కి వచ్చిన వీధుల్లో రీల్స్‌ చేస్తోంది.

ప్రియాంక చోప్రా: హలో హీరో. సెట్స్‌లో మీరు చెప్పే విషయాలన్నీ నేను లీక్‌ చేసేయనా? మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వేసేస్తా.
రాజమౌళి: మహేశ్‌.. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఉందనే సంగతి ఎందుకు చెప్పావ్‌? నువ్వు సర్‌ప్రైజ్‌ను మిస్‌ చేశావ్‌.
మహేశ్‌ బాబు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా సినిమాలో ఉన్నాడనే విషయాన్నీ దాచాలనుకుంటున్నారా?
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: రాజమౌళి సర్‌.. వెకేషన్‌ అని సాకులు చెబుతూ హైదరాబాద్‌కి తరచూ ఎందుకొస్తున్నానో ఇంట్లో కారణాలు చెప్పలేకపోతున్నా. మీరు ఇలాగే లేట్‌ చేస్తే నా కుటుంబం నన్ను అనుమానించడం ప్రారంభిస్తుంది (సరదాగా)
రాజమౌళి: మహేశ్‌ నువ్వు అన్ని సర్‌ప్రైజ్‌లూ బయటపెట్టేశావ్‌. అందుకే నీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ వాయిదా వేయాలని అనుకుంటున్నాను.
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: మీరు మీ విలన్స్‌ని ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు సర్‌.
ప్రియాంక చోప్రా: బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ మహేశ్‌.
మహేశ్‌: ది బెస్ట్‌ని ఎప్పుడూ రాజమౌళి చివరిలోనే చూపిస్తారు.

ఇదీ టీమ్‌ మధ్యలో జరిగిన మిడ్‌నైట్‌ ముచ్చట్లు.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ వాయిదా పడింది అని చెప్పడం కోసం టీమ్‌ ఓ స్క్రిప్ట్‌ రాసుకొని భలేగా మాట్లాడింది కదూ. చూద్దాం మళ్లీ అప్‌డేట్‌ ఇచ్చేటప్పుడు ఎలా చెబుతారో?

కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus