Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

నిరీక్షణకు తెరపడింది. రాజమౌళి మహేష్ బాబు (SSMB29) సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. ముందు నుంచి ఊహిస్తున్నట్లే, ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌కు “వారణాసి” (VARANASI) అని పేరు ఖరారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌లో, 130 అడుగుల భారీ స్టేజ్‌పై ఈ టైటిల్‌ టీజర్ ను రివీల్ చేశారు. ఈవెంట్ నుంచి వచ్చిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

SSMB29 as Varanasi

“గ్లోబ్ ట్రాటర్” అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, అసలు కథా కేంద్రం ‘వారణాసి’ అని జక్కన్న ఈ టైటిల్‌తో తేల్చేశారు. టైటిల్ టీజర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా, ఫైర్ ఎఫెక్ట్‌తో, పైన ఒక గ్లోబ్ (భూగోళం) ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. ఇది సినిమా స్కేల్‌ను, దాని మూలాలను ఒకేసారి రివీల్ చేస్తోంది. ‘వారణాసి’ అనే టైటిల్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

అలాగే మహేష్ బాబు ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని వెళ్లిన విధానం రామాయణంలోని కీలక ఘట్టాన్ని కూడా లో రివిల్ చేసిన విధానం హైలెట్ గా నిలిచింది. ఆఫ్రికాకు సంబంధించిన విజువల్స్ కూడా హైలెట్ అయ్యాయి. ఇది రాజమౌళి మార్క్ ‘ఇండియన్ ఎమోషన్’కు, ‘గ్లోబల్ అడ్వెంచర్‌’కు పెట్టిన పర్ఫెక్ట్ మిక్స్. ‘వారణాసి’ (కాశీ) కేవలం ఒక ప్రాంతం కాదు, అది భారతీయ ఆధ్యాత్మికతకు, చరిత్రకు కేంద్రం.

అంటే, ఈ గ్లోబల్ అడ్వెంచర్ కథ.. కాశీలో దాగి ఉన్న ఏదో ఒక రహస్యం చుట్టూ తిరుగుతుందని, ఇది పక్కా ‘స్పిరిచువల్ అడ్వెంచర్’ అని ఈ టైటిల్ బలంగా చెబుతోంది. ఈ ఈవెంట్ కోసం జక్కన్న ‘నో కెమెరా’ రూల్ పెట్టారంటేనే, ఈ రివీల్ ఎంత పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. ‘కుంభ’ (పృథ్వీరాజ్) పోస్టర్ తర్వాత, ఇప్పుడు ఈ టైటిల్ రివీల్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇది కేవలం యాక్షన్ థ్రిల్లర్ కాదు, అంతకు మించిన ఒక ‘డివైన్ అడ్వెంచర్’ అని జక్కన్న హింట్ ఇచ్చారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ‘వారణాసి’ టైటిల్‌తో ఇండియన్ సోల్‌ను గ్లోబల్ స్టేజ్‌పైకి తీసుకెళ్లడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus