మంచు విష్ణు డిజిటల్ ఎంట్రీ వర్కవుట్ అయ్యేనా ?

Advertisement

నటుడిగా వంద సినిమాలు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో కెరీర్ మొదలెట్టి అనంతరం నెగిటివ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా కెరీర్ ను టర్న్ తీసుకొని ఫ్యామిలీ స్టార్ గా ఎదిగిన శ్రీకాంత్ కు ఈ జనరేషన్ లోనూ మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అయితే.. ఈమధ్యకాలంలో శ్రీకాంత్ కథానాయకుడిగా మాత్రమే కాదు నటుడిగా మెప్పించడంలో కమర్షియల్ గా, సినిమాటిక్ గానూ విఫలమవుతున్నాడు. హీరోగా నటించిన సినిమాలతోపాటు విలన్ గా నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో శ్రీకాంత్ కెరీర్ కాస్త గాడి తప్పింది. మధ్యలో స్నేహితుల కోసమని చెత్త సినిమాలు చేసి తన బిజినెస్ ను తానే పాడు చేసుకున్నాడు శ్రీకాంత్.

కొన్నాళ్ళ విరామం అనంతరం ఇప్పుడు డిజిటల్ డెబ్యు చేయనున్నాడు శ్రీకాంత్. మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతున్న “చదరంగం” అనే వెబ్ సిరీస్ తో శ్రీకాంత్ డిజిటిల్ ప్రపంచాన్ని పలకరించనున్నాడు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడానికి ముందు సమైక్యాంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న కొన్ని నిజమైన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుండి జీ5లో టెలికాస్ట్ కానుంది. మంచు విష్ణు మరియు శ్రీకాంత్ లకు ఇది డిజిటల్ డెబ్యు. మరి ఈ ఇద్దరికీ ఈ కొత్త ప్రపంచం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news