ప్రియురాలు, పెళ్లి గురించి మాట్లాడి.. ట్రెండింగ్‌లో నిలిచి

నిన్న మధ్యాహ్నం వరకు కామ్‌గా ఉన్న ట్విటర్‌లో ఓ బాలీవుడ్‌ టాపిక్‌ ట్రెండింగ్‌లోకి వచ్చి రచ్చ రచ్చ చేసింది. అదే రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌. ఈ ఇద్దరికి సంబంధించిన చాలా రకాల అంశాలు ట్వీట్ల రూపంలో పోటెత్తాయి. దానికి కారనం రణ్‌బీర్.. ఆలియాతో పెళ్లి ముచ్చటను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకేముంది నెటిజన్లు ట్వీట్లతో దీవించేశారు. అసలేమైందంటే?

ఓ బాలీవుడ్‌ మీడియా ఛానల్‌కు రణ్‌బీర్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతూ కరోనా పరిస్థితులు లేకుంటే ఈ పాటికే నా గాళ్‌ఫ్రెండ్‌ ఆలియాతో నా పెళ్లి అయిపోయేది అని చెప్పాడు. దాంతోపాటు లాక్‌డౌన్‌ టైమ్‌లో తామేం చేశామో కూడా చెప్పాడు. అదే ఇప్పుడు ట్విటర్‌లో చర్చ. నిజానికి డిసెంబరు తొలి వారంలో ‘మా పెళ్లి’ అంటూ కొన్ని నెలల క్రితం రణ్‌బీర్‌ చెప్పాడంటూ వార్తలొచ్చాయి. తర్వాత ఆ ఊసు లేదు. మళ్లీ ఇప్పుడు ఆ సంగతి బయటికొచ్చింది.

లాక్‌డౌన్‌ టైమ్‌లో రణ్‌బీర్‌ ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో గడపడం లాంటివి చేశాడట. రోజుకు రెండు, మూడు సినిమాలు చూసేవాడట. అదే సమయంలో ఆలియా గిటార్ నేర్చుకుందట. స్క్రీన్‌ రైటింగ్‌లో కూడా శిక్షణ పొందిందట. ఇంకా చాలా చేసిందట. ఆలియా ఏ విషయమైనా అనుకుంటే సాధించేస్తుంది. ఆ విషయంలో నేను కాస్త వెనుకబడతాను అని రణ్‌బీర్‌ చెప్పాడు. ఇక పెళ్లి విషయం అంటారా… కరోనా కారణంగా ఆగిన ఆ శుభఘడియలు ఎప్పుడు వస్తాయో త్వరలో చెబుతా అన్నాడు. సో అభిమానులూ ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus