టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి పాపులర్ అయిన నటులలో దేవరాజ్ ఒకరు. తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్య్వూ ఇచ్చిన దేవరాజ్ జూనియర్ ఎన్టీఆర్, బన్నీ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. (Jr NTR)తారక్ కు తాత టాలెంట్ వచ్చిందని ఆయన అన్నారు.
బన్నీ డ్యాన్స్ సూపర్ గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. తమ ఫేవరెట్ హీరోల గురించి దేవరాజ్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. 300కు పైగా సినిమాలలో నటించిన ఈ నటుడు చివరిగా భరత్ అనే నేను సినిమాలో నటించారు. కెరీర్ విషయంలో నేను చాలా హ్యాపీ అని ఆయన చెప్పుకొచ్చారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.
మూడు నెలల వయస్సులో ఉన్న సమయంలో నాన్న చనిపోయారని అమ్మ పొలాలు చేయడంతో పాటు పాల వ్యాపారం చేసి పోషించారని దేవరాజ్ తెలిపారు. నేను బీఎస్సీ చదివే సమయంలో జాబ్ వచ్చిందని ఆయన అన్నారు. మొదట ఒక డ్రామాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నానని దేవరాజ్ పేర్కొన్నారు. డ్రామాల ద్వారా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆయన అన్నారు.
డ్రామాలలో అన్ని రకాల పాత్రలు పోషించానని ఆయన కామెంట్లు చేశారు. నేను కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే వరకు జాబ్ చేశానని దేవరాజ్ తెలిపారు. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని ఆయన పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఛాలెంజింగ్ రోల్స్ లో ఎక్కువగా నటించానని దేవరాజ్ అన్నారు. దేవరాజ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.