Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

మొన్నీమధ్యనే మనం మాట్లాడుకున్నాం.. ఓ ఐటెమ్‌ సాంగ్‌ వల్ల హీరోయిన్‌ మాత్రమే కాదు.. యాక్టర్‌ కూడా హైలైట్‌ అయ్యాడని మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పాట ‘మోనికా..’ అయితే.. ఆ యాక్టర్‌ సౌబిన్‌ సాహిర్‌. మలయాళంలో వెర్సటైల్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సౌబిన్‌.. ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నాడు అంటే.. ఏదో ఒక మంచి పాత్రే అయి ఉంటుంది అని అనుకున్నారంతా. కానీ ‘మోనికా..’ సాంగ్‌లో అతని డ్యాన్స్‌, సందడి చూసి భలే చేశాడయ్యా మనోడు అని తెలుగు మలయాళ సినిమా లవర్స్‌ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రశంసలు వేరొక నటుడికి దక్కాల్సినవి అని మీకు తెలుసా?

Fahad Fazil

అవును ‘కూలీ’ సినిమాఓల సౌబిన్‌ సాహిర్‌ చేసిన పాత్ర కోసం తొలుత దర్శుకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మరో మలయాళ స్టార్‌ యాక్టర్‌ను సంప్రదించారట. అయితే ఆయన డేట్స్‌ కుదరకపోవడంతో సినిమా కోసం వేరొకరిని సంప్రదించాల్సి వచ్చిందట. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ సంప్రదించింది ఎవరినో కాదు మన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అలియాస్‌ ఫహాద్ ఫాజిల్‌ని. సౌబిన్‌ చేసిన పాత్రను తొలుత ఫహాద్‌కి చెప్పారట లోకేశ్‌.. కానీ అప్పటికే వరుస సినిమాలు ఓకే చేసిన ఫహాద్‌ నో అన్నారు.

రజనీకాంత్‌, ఫహాద్‌ కాంబినేషన్‌కి మంచి స్పందనే వచ్చింది ఇప్పటివరకు. ఇద్దరూ కలసి ‘వేట్టయన్‌’లో చేశారు. అందులో సీన్స్‌ భలే ఉంటాయి. ఇక ఫహాద్‌ – లోకేశ్‌ కాంబో కూడా అదిరిపోతుంది. ‘విక్రమ్‌’ సినిమాలో మంచి పాత్ర చేశారాయన. అలాంటి రెండు కాంబోలు కలసి ఇప్పుడు ‘కూలీ’గా వచ్చిన ఇంకా బాగుండేది.

అన్నింటికి మించి ‘మోనికా..’ సాంగ్‌లో ఫహాద్‌ను చూసేవాళ్లం. చూద్దాం ఇప్పటికే డ్యాన్స్‌తో పూజను ఓవర్‌లాప్‌ చేసిన సౌబిన్‌.. ఫహాద్‌ను ఎలా మరపిస్తాడో. ఆ సంగతి తేలాంటే ఆగస్టు 14 రావాల్సిందే. అప్పుడేగా ‘కూలీ’ ఆగమనం. అన్నట్లు ఈ సినిమాలో నాగార్జున్‌, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర కూడా నటిస్తున్నారు.

 ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus