ఏదైనా ఒక అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంత సంతోషంగా అనిపిస్తుందో.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతేే మాత్రం అంతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.. సంతోషంలో జరిగే సంఘటనలు జీవితంలో విషాదం నింపకూడదనే అందరూ అనుకుంటారు కానీ ప్రమాదవశాత్తు జరిగే వాటిని ఎవరు మాత్రం ఆపగలరు చెప్పండి.. అలాంటి ఓ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది.. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ పార్టీలు ఏ రేంజ్‌లో జరుగుతాయో తెలిసిందే.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చిత్ర విచిత్రమైన వేషదారణలో కనిపిస్తుంటారు..
ఎప్పటిలానే హలోవీన్ వేడుకలు దక్షిణ కొరియాలో చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. దక్షిణ కొరియాలోని ఇటాయ్‌వాన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన హాలోవీన్ పార్టీలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో జనం ఒక్కసారిగా పరుగులు మొదలుపెట్టారు.. వారి పరుగులే ప్రమాదానికి కారణమయ్యాయి.. ఒకేసారి దాదాపు లక్ష మంది పరుగులు పెట్టేసరికి భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 154 మంది మరణించారు. వీరిలో 132 మంది దక్షిణ కొరియా వాళ్లు కాగా, మిగతా వాళ్లంతా ఇతర దేశస్థులు.
దక్షిణ కొరియాకు చెందిన మృతుల్లో ప్రముఖ నటుడు, సింగర్ లీ జిహాన్ కూడా ఉన్నారు. లీ జిహాన్ 2017లో వచ్చిన ‘ప్రొడ్యూస్ 101’లో కంటెస్టెంట్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2019లో వచ్చిన ‘‘ టు డే వాస్ అనదర్ నామ్ హ్యూన్ డే’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. లీ జిహాన్ కేవలం 24 ఏళ్ల వయసులో మృత్యువాత పడడం అనేది అందరి మనసుల్ని కలచివేస్తుంది..ఈ సంఘటనకు సంబంధించి 935 ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ప్రకటన చేసింది.. ‘‘హలోవీన్ వేడుకల్లో లీ జిహాన్ కన్నుమూయడం వాస్తవం..
ఈ దుర్ఘటనతో ఆయన కుటుంబం షాక్‌కి గురైంది.. లీ చాలామంచి వాడు.. అందరితో స్నేహంగా ఉండేవాడు.. ఎవరినైనా సరే ప్రేమగా పలకరించే లీ ఇక లేడంటే నమ్మలేకపోతున్నాం.. లీ జిహాన్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ఆకాంక్షించింది. సోషల్ మీడియాలోనూ లీ జిహాన్ మృతిపై భారీ స్థాయిలో సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు బాధాతప్త హృదయాలతో అతడికి నివాళులు అర్పిస్తున్నారు.