లెజెండరీ నటుడు మృతి!
- July 16, 2026 / 12:52 PM ISTByFilmy Focus
సినీ పరిశ్రమలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ లెజెండరీ నటుడు ఈరోజు కన్నుమూశాడు. హాలీవుడ్ సినిమా చరిత్రలో ‘జురాసిక్ పార్క్’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు సామ్ నీల్. ఈరోజు ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది. సామ్ నీల్ వయసు 78 ఏళ్ళు. దశాబ్ద కాలం పాటు తన విలక్షణమైన నటనతో మెప్పించిన నీల్ ప్రయాణం ఈరోజు ముగియడం అనేది హాలీవుడ్‌కు తీరని లోటు అనే చెప్పాలి.
Sam Neill
ఇక సామ్ నీల్ ఏజెంట్ అయిన ఫిలిప్ గ్రేస్ట్.. అతని మరణానికి గల కారణం వివరించాడు.కొన్నాళ్లుగా అతను తీవ్రమైన న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడట. దాని తీవ్రత పెరగడంతో నీల్ మరణించినట్టు ఫిలిప్ తెలిపాడు. నిజానికి సామ్ నీల్ గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడు. లింఫోమా/ బ్లడ్ క్యాన్సర్ బారిన పడినప్పటికీ దానిని జయించాడు నీల్. ధైర్యం కోల్పోకుండా, ఆధునిక వైద్య విధానమైన ‘కార్-టి’ (CAR-T) థెరపీ అనే అత్యంత వినూత్నమైన..

అలాగే కష్టమైన చికిత్సను తీసుకుని ఆ వ్యాధిపై గెలుపొందాడు. అయితే క్యాన్సర్‌ను జయించిన నీల్ న్యుమోనియా పై మాత్రం ఓడిపోయి ప్రాణాలు విడిచాడు. నిజజీవితంలో బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వల్ల ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడాన్ని న్యుమోనియా అని ప్రస్తావిస్తారు వైద్యులు. ఇక నీల్ మృతిపై సెలబ్రిటీలు సంతాపం తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే నీల్ ఆత్మకి శాంతి చేకూరాలని కూడా ఆశిస్తున్నారు.
నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్!












