కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే సంజయ్ దత్, అర్జున్, మన్సూర్ అలీ , గౌతమ్ మీనన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.. అయినప్పటికీ కలెక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష పై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి అని చెప్పాలి. అతను మాట్లాడుతూ.. “లియో చిత్రంలో త్రిష నటిస్తుంది అని నాకు తెలిసింది. ఈ సినిమాలో త్రిషతో నాకు ఓ రేప్ సీన్ ఉంటుందని భావించాను. ఆమెను బెడ్రూమ్ కి తీసుకేల్దామని ఆశించాను. కానీ దురదృష్టవశాత్తు అలాంటి సీన్లు ఏమీ సినిమాలో లేవు. నా గత సినిమాల్లో కుష్బూ, రోజా వంటి ఎంతో మంది హీరోయిన్లతో రేప్ సీన్స్ లో నటించాను.
రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ‘లియో’ సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు” అంటూ అతను ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఇతని కామెంట్స్ పై తాజాగా త్రిష స్పందించింది. ఆమె మాట్లాడుతూ… ఇటీవల ఓ వీడియోలో మన్సూర్ అలీ ఖాన్ నా గురించి చాలా నీచంగా, అసహ్యంగా మాట్లాడాడు. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తుంది.
అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని అని నేను భావిస్తున్నాను. నేను భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో అతనితో నటించకుండా ఉండాలని భావిస్తున్నాను. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాను. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది అనడంలో సందేహం లేదు” అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చింది (Trisha) త్రిష. ఈ క్రమంలో నెటిజన్లు కూడా త్రిషకి మద్దతు పలుకుతున్నారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!