లేడీ లుక్‌తో షాక్‌ ఇచ్చిన స్టార్‌ యాక్టర్‌

  • August 24, 2022 / 01:12 PM IST

విలక్షణ నటుడు.. ఈ పేరుకు సార్థకం చేసేలా బాలీవుడ్‌లో అతికొద్దిమంది నటులు ఉన్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో జీవించేయడం వారికి అలవాటు. అందుకే ఒక్కోసారి ఆ నటుడి పేరు చెప్పగానే కళ్ల ముందు వారు గతంలో పోషించిన పాత్రలన్నీ రీల్‌లాగా స్క్రోల్‌ అవుతూ ఉంటాయి. అలాంటి నటుల్లో నవాజుద్దీన సిద్ధిఖీ ఒకరు. బాలీవుడ్‌లో ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన నిలవడానికి ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘హడ్డీ’. ఇందులో ఆయన మహిళగా కనిపిస్తారట.

బాలీవుడ్‌లో వైవిద్యమైన సినిమాలు చాలానే తెరకెక్కుతుంటాయి. అలాంటి సినిమాల్లో కచ్చితంగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఉంటారు. ఈ మాట మేం అనడం కాదు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అలాంటి లిస్ట్‌లో ఉండే సినిమా చేస్తున్నాం అంటూ ‘హడ్డీ’ అనే సినిమాను అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఓ పాడుబడ్డ గొడౌన్‌లో లేడీ డాన్‌లా నవాజుద్దీన సిద్ధిఖీ కనిపించారు. లుక్‌ చూస్తే ఆయనేనా అని అనిపిస్తోంది.

రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్‌ పోస్టర్‌ బట్టి చూస్తే ఈ సినిమా పవర్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతోంది. గతంలో రకరకాల పాత్రలు పోషించాను. ‘హడ్డీ’ వాటికి భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. నటుడిగా నన్ను మరింత రాటుదేల్చుతుంది అని నవాజుద్దీన్‌ సిద్ధిఖీ పేర్కొన్నారు. మీరు చూడండి ఈ పోస్టర్‌, ఎక్కడైనా నవాజుద్దీన్‌ కనిపిస్తున్నారా?

లేదు కదా, అదే ఆయన టాలెంట్‌. ఏ పాత్ర ఎంచుకుంటే అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు. ఇన్నాళ్లూ పాత్రకు తగ్గట్టుగా మారిపోతే మెరుపులు మెరిపించారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. మరి ఈ సినిమాతో ఏం రేంజిలో అలరిస్తారో చూడాలి. ఈ సినిమా తెలుగులో రావడం కష్టమే కానీ, హిందీలో విడుదలైతే చూడటానిక ఆసక్తి చూపించే సినీ ప్రేమికులు చాలామందే ఉంటారు. ఏమంటారు నిజమే కదా.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus