బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ‘కహానీ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘భజరంగీ భాయీజాన్’, ‘తలాష్’, ‘బద్లాపూర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్ గా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో వంద కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకునే స్టార్ హీరోలపై కొన్ని కామెంట్స్ చేశారు. ఒక సినిమా ఎంతవరకు ఆడుతుంది..? దాని కలెక్షన్స్ ఎంత..? అనేది నిర్మాత చూసుకుంటాడు..
ఓ నటుడు టికెట్స్ అమ్మకాల గురించి బాధపడకూడదని అన్నారు. అది అవినీతి అవుతుందని అన్నారు. ఒక నటుడు సినిమా టికెట్స్ అమ్మకాల గురించి ఎందుకు మాట్లాడాలని..? ప్రశ్నించారు. సినిమాకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేసే హీరోల సినిమాలకే నష్టాలు వస్తున్నాయని అన్నారు. పరిమితికి మించి సినిమాపై ఖర్చు చేస్తేనే అది ఫెయిల్ అవుతుందని అన్నారు. నటీనటులు, కథకులు, దర్శకులు ప్లాప్ అవ్వరని.. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా అది బడ్జెట్ వల్లేనని చెప్పుకొచ్చారు.
డబ్బు ఎప్పుడూ మంచి ఆలోచనలు, అభిరుచిని వెంటాడుతుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ భాషలో ఒక వ్యక్తి దగ్గర అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటే, ఆ స్క్రిప్ట్‌ని పొందడానికి నిర్మాతలు డబ్బుతో ఆ వ్యక్తి వెనుక పరుగులు పెడతారు అంటూ చెప్పుకొచ్చారు. సామర్ధ్యం ఉన్న మెదడుకి, మంచి ఆలోచనలతో ముందుకు రాగల వ్యక్తికి మనం మరింత ఫ్రీడమ్ ఇవ్వాలని తెలిపారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో స్టార్ డ్రివెన్ కాన్సెప్ట్ అనేది ఎండ్ అయిపోతుందని..
జనాలు అప్డేట్ అవుతున్నా.. మన స్టార్స్ మాత్రం అప్డేట్ కాలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడు ‘హడ్డి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే కంగనా రనౌత్ బ్యానర్ లో ‘టిక్కు వెడ్స్ షేరు’ అనే సినిమా చేస్తున్నారు.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!