లేటు వయసులో సీనియర్ నటితో ప్రముఖ నటుడి పెళ్లి!

  • November 21, 2024 / 07:12 PM IST

శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar)  అందరికీ సుపరిచితమే. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజూ పండగే (Prati Roju Pandage) , బ్రోచేవారెవరురా (Brochevarevarura) వంటి పలు హిట్ సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ‘పొట్టేల్’ (Pottel)  సినిమా సక్సెస్ మీట్లో రివ్యూయర్ల పై ఘోరంగా మండిపడి హేయమైన వ్యాఖ్యలు చేశాడు. అలా కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు ఓ నటిని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పి షాకిచ్చాడు.

Srikanth Iyengar

వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్… మరో సీనియర్ నటి అయినటువంటి జ్యోతిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.ఆయన పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో జ్యోతి.. శ్రీకాంత్ కి ముద్దు పెట్టడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ‘క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?’ అంటూ కామెంట్ కూడా పెట్టాడు శ్రీకాంత్. దీంతో ఇతని పోస్ట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. శ్రీకాంత్ అయ్యంగార్, జ్యోతి..ల ఫాలోవర్స్ ఈ పోస్ట్ చూసి తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

మరికొంతమంది అయితే ఆర్జీవీ శిష్యరికంతో జనాలని చీట్ చేయాలని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అంటూ అభిప్రాయపడుతున్నారు. శ్రీకాంత్ వయసు ఇప్పుడు 54 , ఇక జ్యోతి వయసు కూడా 45 కి పైనే ఉంటాయని అంచనా.శ్రీకాంత్ సంగతేమో కానీ జ్యోతికి గతంలో పెళ్లవడం.. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. బిగ్ బాస్ తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆమె కూడా గతంలో పలు వివాదాలతో హాట్ టాపిక్ అయ్యింది.

అల్లరి నరేష్ సినిమా సేఫ్ అయిపోయింది కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus