ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!

వరుసగా కోలీవుడ్ సెలబ్రిటీలు (Kollywood) విడాకుల బాట పట్టడం అందరినీ ఒకింత షాక్ కి గురిచేస్తుంది. ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న అంటే నవంబర్ 19న సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన వచ్చింది. 29 ఏళ్ళ తర్వాత అదీ ముగ్గురు పిల్లలు ఉండగా ఈ జంట విడాకులు ప్రకటించడం అందరినీ అయోమయంలోకి నెట్టేసింది అని చెప్పాలి. ముఖ్యంగా సైరా భాను లాయర్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.

Kollywood

’57 ఏళ్ళ వయసులో రెహమాన్, 50 ఏళ్ళ వయసులో సైరా భాను విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?’ అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది పక్కన పెడితే.. ఒక్క రెహమాన్ అనే కాదు ఇటీవల ఇంకొంతమంది కోలీవుడ్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం జరిగింది.

స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. రవి విడాకులు ఇస్తున్నట్టు ఆమెకు తెలీదని తర్వాత ఆర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలు ఉండగా విడాకులు తీసుకోవడం తనకి ఇష్టం లేదు అని ఆమె తెలిపింది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) కూడా తన భార్య సైంధవితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. 2013 లో వీరి వివాహం జరిగింది.2024 లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జీవి ప్రకాష్.. రెహమాన్ కి మేనల్లుడు కావడం.

అలాగే సీనియర్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ (AL Vijay) హీరోయిన్ అమలా పాల్ (Amala Paul) ని పెళ్లి చేసుకోవడం.. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేరే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు.

స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ (Amy Jackson) కూడా ముందుగా ఓ నటుడితో డేటింగ్ చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి ఎడ్. వెస్ట్ విక్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.

ధనుష్ (Dhanush) కూడా తన భార్య ఐశ్వర్యతో (Aishwarya) విడాకులు తీసుకుంటున్నట్టు రెండేళ్ల క్రితం ప్రకటించారు.18 ఏళ్ళు కాపురం చేసి విడాకులు తీసుకుంటున్నట్టు ఈ జంట ప్రకటించడం అందరికీ షాకిచ్చింది. కానీ తర్వాత పిల్లల కోసం విడాకులు తీసుకోకుండా సెపరేట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది.

మొత్తంగా ఈ లిస్ట్ ను గమనిస్తే.. ఎక్కువ కాలం కాపురం చేసి విడాకులు తీసుకున్న జంటలే ఎక్కువగా ఉన్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డుపై కన్నేసిన ‘పుష్ప’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus