Bachhala Malli: అల్లరి నరేష్ సినిమా సేఫ్ అయిపోయింది కానీ..!

అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better)  ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘బచ్చల మల్లి’  (Bachhala Malli)  అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ నెవర్ బిఫోర్ అనే విధంగా కనిపించబోతున్నాడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఈ చిత్రం అందరి అటెన్షన్ ను డ్రా చేసింది. గ్లింప్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.

Bachhala Malli

సడన్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప 2’  (Pushpa 2)  వంటి బడా సినిమా ఓ పక్క.. ‘రాబిన్ హుడ్’ (Robinhood)  ఇంకో పక్క రిలీజ్ అవుతుండటం.. వాటి మధ్యలో ‘బచ్చల మల్లి’ రిలీజ్ అవుతుండటం అందరికీ షాకిచ్చింది. అలా రిలీజ్ అవ్వడం వల్ల ‘బచ్చల మల్లి’ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. అయినా నిర్మాత ఎందుకు డేర్ చేస్తున్నారు? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. దీనికి కారణం లేకపోలేదు. విషయం ఏంటంటే..

‘బచ్చల మల్లి’ (Bachhala Malli) చిత్రానికి బిజినెస్ బాగా జరిగిందట. రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి రూ.16 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే రిలీజ్ కి ముందే నిర్మాత లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అనుకోవాలి. పైగా ఓటీటీ బిజినెస్ కూడా జరిగిపోవడం వల్ల సినిమాని ఫాస్ట్ గా రిలీజ్ చేయాల్సి వస్తుందట. అందుకే డిసెంబర్ 20 డేట్ కి ఫిక్స్ అయ్యారు. సినిమాకి 4 వారాల థియేట్రికల్ రన్ ఉండాలి కాబట్టి, 2025 సంక్రాంతికి ‘బచ్చల మల్లి’ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

అలాంటి అభిమానులు ఉన్నందుకు గర్వపడుతున్నాను : మహేష్ బాబు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus