సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కొందరు వయసు రీత్యా వచ్చే సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకుని కూడా మరణిస్తూ ఉండడం షాకిచ్చే అంశం. ఇప్పటికే ‘వారసుడు’ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మరణించారు. అటు తర్వాత అలనాటి స్టార్ హీరోయిన్ జమున, విశ్వనాథ్, వాణీ జయరామ్, నందమూరి తారకరత్న, దర్శకుడు సాగర్ వంటి సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు.
ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడం సినీ జనాలు షాక్ కు గురిచేసింది. విషయంలోకి వెళితే.. ఓ ప్రముఖ నటి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్ చేసుకుని మరణించింది. ఈమె వయసు 25 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం పై క్లారిటీ లేదు.
గత నెల వాలెంటైన్స్ డే రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా ఈమె షేర్ చేసింది. అతని పేరు సమర్ సింగ్. అప్పటికే ఆకాంక్ష దూబే అతనితో రిలేషన్ షిప్ లో ఉంది.అయితే ఇతనితో మనస్పర్థలు రావడంతో ఆకాంక్ష ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోపక్క తల్లిదండ్రులకు కూడా ఈమె నటి అవ్వడం ఇష్టం లేదు. అందుకే ఈమె పై ఒత్తిడి పెంచారా అనే విషయం పై కూడా తల్లిదండ్రులను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?