ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల గురించి ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు సినీ సెలబ్రిటీలకు కోపం తెప్పిస్తుండటం గమనార్హం. షెహనాజ్ సిద్దార్థ్ శుక్లా జోడీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది. సిద్దార్థ్ శుక్లా మరణం షెహనాజ్ ను ఎంతగానో బాధ పెట్టింది. సిద్దార్థ్ శుక్లా మరణం వల్ల ఆమె కొంతకాలం పాటు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురయ్యారు. బిగ్ బాస్ సీజన్ 13 విజేత, నటుడు సిద్దార్థ్ శుక్లా 40 సంవత్సరాల వయస్సులోనే లోకాన్ని వీడటం బాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.
షెహనాజ్ సిద్దార్థ్ శుక్లా జోడీ క్యూట్ జోడీ అని ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటంతో పాటు ఈ జోడీకి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండేది. సిద్నాజ్ పేరుతో ఈ జోడీకి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి లవ్ ట్రాక్ కు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. పలు మ్యూజిక్ ఆల్బమ్ లలో వీళ్లిద్దరూ కలిసి నటించగా ఆ ఆల్బమ్స్ ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యాయి.
దివానే3 అనే షో కూడా ఈ జోడీకి మంచి పేరు తెచ్చిపెట్టగా వీళ్లిద్దరూ కలిసి చేసిన చివరి షో ఇదే కావడం గమనార్హం. సిద్దార్థ్ శుక్లా మరణం తర్వాత సింగిల్ గా షెహనాజ్ జీవనం సాగిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఆమె డ్యాన్స్ మాస్టర్ రాఘవ్ జుయల్ తో కలిసి కనిపించారు. షెహనాజ్ రాఘవ్ జుయల్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు ప్రచారంలోకి రాగా ఆమె ఘాటుగా స్పందించారు.
ఎందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాఘవ్ తో కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్టేనా అని ఆమె అన్నారు. తాను డేటింగ్ లో లేనని షెహనాజ్ క్లారిటీ ఇవ్వడంతో వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.