హీరోయిన్ స్వస్తికా ముఖర్జీ హెయిర్ స్టైల్ పై పెద్ద చర్చే నడుస్తుంది. కారణం ఏమిటో తెలియదు ఆమె అరగుండు చేయించుకున్నారు. తలకు ఓ ప్రక్క సెమీ షేవ్ చేయించిన ఆమె మరో ప్రక్క పూర్తి జుట్టుతో ఉన్నారు. ఆమె హెయిర్ స్టైల్ పై నెటిజెన్స్ వింత వింత కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ నెటిజెన్ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ మేకప్ లేని మీ ముఖం బాగోలేదు అని కామెంట్ చేశారు. దానికి ఆమె నిజంగానా, అందంగా కనిపించకపోవడం కూడా మంచి విషయమే అని రిప్లై ఇచ్చింది.
అలాగే ఆమె అలా అరగుండు చేయించుకోవడానికి నెటిజెన్స్ అనేక పుకార్లు, అపోహలు తెరపైకి తెస్తున్నారు. దీనితో సదరు నటి ఓ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. స్వస్తికా ముఖర్జీ తన ట్వీట్ లో ”నాకు కాన్సర్ లేదు, నాకు డ్రగ్స్ అలవాటు లేదు, నేను స్మోక్ చేయను. అలాగే నేను ఎటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకోలేదు. ఇది నాజుట్టు, నాకు ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటాను. మీ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పాను, ఇక పండగ చేసుకోండి” అని వివరణ ఇచ్చారు.
దీనితో ఆమె హెయిర్ స్టయిల్ కారణంగా ఆమె ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితంపై అనుమానాలు, ఆరోణలు చేస్తున్నవారికి సమాధానం ఇచ్చింది. బెంగాలీ నటి అయిన స్వస్తికా ముఖర్జీ సుశాంత్ రాజ్ పుత్ చివరి చిత్రం దిల్ బేచారా మూవీలో ఓ కీలక పాత్ర చేశారు.