Actress: ఆ డైరెక్టర్ గురించి సంచలన కామెంట్స్ చేసిన నటి

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విజే దీపిక యూట్యూబ్ నుంచి తమిళ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాక్టర్ గా మారింది. ఆ తర్వాత హోస్ట్ గా పలు అవతారాలు ఎత్తిన ఈమె పాండియన్ స్టోరీ సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్స్ ద్వారానే కాక ఇన్‌స్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దీపిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించింది.

కెరీర్ స్టార్టింగ్ లో ప్ర‌ముఖ డ్యాన్స్‌మాస్ట‌ర్‌, ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా ఆడిషన్స్ లో పార్టిస్పేట్ చేశానని.. ఆ సినిమాలో లారెన్స్ చెల్లిగా నన్ను సెలెక్ట్ చేశారని నేను ఎంతో సంతోష పడిపోయాను అంటూ వివరించింది. ఆ తరువాత సినిమాలో ఒక ముద్దు సీన్ ఉంటుంది ముందుగానే దాని రిహార్సల్స్ ఇప్పుడు చూపించమని డైరెక్టర్ చెప్పాడని.. ఎప్పుడో సీన్లో చేసే ముద్దు సీన్‌కు ఇప్పుడు రిహార్సల్స్ ఏంటి ? నేను ఒప్పుకోన‌ని చెప్పాన‌ని..

అయితే నువ్వు వెళ్ళవచ్చు… ఆడిషన్స్ కు వచ్చిన వారిలో వేరొకరిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అని ఆ ద‌ర్శ‌కుడు బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఆ త‌ర్వాత కూడా త‌న‌ను బెదిరిస్తూ ఆలోచించుకో ఇది నీకు మంచి అవకాశం, ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు అంటూ అతడు నన్ను ఒత్తిడి చేశాడని.. అయినా నేను అతనికి లొంగలేద‌ని వివరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు నాలో నేనే ఎంతగానో బాధపడ్డాన‌ని గుర్తుచేసుకుంది దీపిక.

ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండే దీపిక (Actress) 2018 లో వచ్చిన పాండియన్ స్టోరీస్ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్లో ఇందు సుజిత్, స్టాలిన్ సహ కొంతమంది కీ రోల్‌ ప్లే చేశారు. ఈ సీరియల్ తమిళంలో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అయింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus