అరపూట షూటింగ్ పార్ట్ కు అంత డిమాండ్ చేస్తుందేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ ను సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘వకీల్ సాబ్’ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘బోణి కపూర్’ ‘దిల్ రాజు’ నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం 70శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. నిజానికి మే 15న ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది… కానీ వర్కౌట్ కాలేదు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. హిందీలో అయితే అమితాబ్ పాత్రకు హీరోయిన్ ఉండదు. కానీ ముందుగా ‘పింక్’ ను ‘నేర్కొండ పార్వే’ గా తమిళంలో అజిత్ తో రీమేక్ చేశారు. అక్కడ అజిత్ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ను డిజైన్ చేసి అందులో హీరోయిన్ ను పెట్టారు. కాబట్టి తెలుగులో కూడా పవన్ ఫ్యాన్స్ కోసం హీరోయిన్ ట్రాక్ పెట్టబోతున్నారు.

ఇప్పటి వరకూ అధికారికంగా హీరోయిన్ ఎవరు అని నిర్మాతలు అనౌన్స్ చెయ్యలేదు కానీ ఓ సందర్భంలో దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం శృతి హాసనే హీరోయిన్ అని బయటపడిపోయాడు. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నటించడానికి శృతీ హాసన్ 70 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఆమె షూటింగ్ పార్ట్ మొత్తం కలిపి 10 గంటలు ఉంటుందట. అలా 7 రోజులు కాల్ షీట్లు నిర్మాతలు అడిగినట్టు తెలుస్తుంది. అంటే ‘వకీల్ సాబ్’ చిత్రం కోసం శృతీ హాసన్ గంటకు లక్ష డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus