బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌ని అవమానించిన సంఘటన గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరసన తెలియజేస్తున్నారు.. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షో ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’.. ఇదొక అమెరికన్ సిట్‌కామ్.. ఇండియాలోనూ జనాదరణ పొందింది.. 12 సీజన్ల తర్వాత లాస్ట్ ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది.. ఇటీవల సెకండ్ సీజన్ స్టార్ట్ కాగా ఫస్ట్ ఎపిసోడ్‌లో మాధురీ దీక్షిత్‌పై షాకింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపింది..
ఈ షోలో షెల్డన్ కూపర్ క్యారెక్టర్ చేస్తున్న జిమ్ పార్సన్స్, బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ (Actress) ఐశ్వర్య రాయ్‌ని ‘పేదవారి పాలిట మాధురీ దీక్షిత్’ అని పొగడగా.. రాజ్ పాత్ర చేస్తున్న కునాల్ నయ్యర్ ఈ విషయంలో అభ్యంతరం తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. ‘ఐశ్వర్య రాయ్ దేవత.. మాధురీ దీక్షిత్ (కుష్ఠురోగి – వేశ్య)’ అంటూ దారుణంగా మాట్లాడాడు.. ఒక పాపులర్ నటిని అలా ఎలా అవమానిస్తాడంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..
అతడి వ్యాఖ్యలపై అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ స్పందించారు.. ‘వాడికేమైనా పిచ్చి పట్టిందా?.. వాణ్ణి వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలి.. అతని వ్యాఖ్యల పట్ల అతని కుటుంబ సభ్యులను నిలదీయాలి’ అంటూ ఫైర్ అయ్యారు.. మరో సీనియర్ నటి ఊర్మిళ.. ‘కునాల్ కామెంట్స్ అత్యంత దారుణం’ అన్నారు..
నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు..
ఈ ఎపిసోడ్‌ని తొలగించాలంటూ.. రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్‌ని టెలికాస్ట్ చేస్తున్న నెట్‌ఫిక్స్ సంస్థకు లీగల్ నోటీసులు పంపారు.. సెకండ్ సీజన్, ఫస్ట్ ఎపిసొడ్‌లో మాధురీ దీక్షిత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అవి పరువు నష్టం కలింగించేలా ఉన్నాయి.. ఇలాంటి కంటెంట్ సమాజం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీస్‌లో పేర్కొన్నారు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు కూడా కునాల్ నయ్యర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు..