తనను తానే పెళ్లి చేసుకున్న నటి.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని వింత ఘటనలు నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అబ్బాయి అమ్మాయి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండటం గురించి, అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం గురించి మనం చాలా సందర్భాల్లో విన్నామనే సంగతి తెలిసిందే. అయితే ఒక అమ్మాయి తనకు తాను పెళ్లి చేసుకోవడం గురించి మాత్రం మనం ఎప్పుడూ వినలేదు. ప్రముఖ సీరియల్ నటీమణులలో ఒకరైన కనిష్క సోని తనకు తానుగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు.

దియా ఔర్‌ బాతీ హమ్‌ అనే సీరియల్ ద్వారా కనిష్క సోనికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. తాజాగా కనిష్క సోని సోషల్ మీడియా వేదికగా తనకు తానే పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరంతో పెళ్లైన యువతిలా ఆమె కనిపించారు. ఈ ఫోటోల గురించి ఆమె చెబుతూ నా కలలను నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను లవ్ చేస్తున్న ఏకైక వ్యక్తిని కూడా నేనేనని ఆమె కామెంట్లు చేశారు.

ఈ రీజన్ వల్లే నాకు నేనుగా మ్యారేజ్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కనిష్క సోని చేసిన కామెంట్లు నచ్చని నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. తనపై వ్యక్తమైన నెగిటివ్ కామెంట్ల గురించి ఆమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నేను చేసిన పోస్ట్ గురించి చాలామంది చాలారకాలుగా స్పందిస్తున్నారని ఆమె తెలిపారు. కొందరు వెరైటీగా రియాక్ట్ అవుతుంటే మరి కొందరు నన్ను ద్వేషిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

మాటలకు వాల్యూ ఇచ్చి కట్టుబడే వ్యక్తి నాకు లైఫ్ లో కనిపించలేదని ఆమె అన్నారు. శృంగారం కోసం మగాడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలనని ఆమె చెప్పుకొచ్చారు. వివాహం అంటే శృంగారం మాత్రమే కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నానని హాలీవుడ్ వైపు కెరీర్ కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus