ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు ఓ హీరోయిన్‌పై నిషేధం విధించారంటే నమ్ముతారా? అదేంటి హీరోయిన్లు ఫ్యాషన్ షోలో పాల్గొనడం, ర్యాంప్ వాక్‌లు చేయడం, క్యాట్ వాక్‌లు నడవడం నేరమా? అని అనుకుంటున్నారా? మన దగ్గర లేదంటే బాలీవుడ్‌లో అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ.. మణిపూర్‌లో మాత్రం పెద్ద విషయమే. అక్కడ దీనికి పెద్ద ఎత్తున శిక్ష పడుతుంది. అందుకే ఓ యంగ్ హీరోయిన్‌పై ఏకంగా మూడేళ్లు నిషేధం విధించారు. ఇంతకీ ఏమైందంటే?
మణిపూర్‌కు చెందిన సోమ లైష్రామ్ అనే నటి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. దీంతో మణిపూర్‌కు చెందిన కంగ్లేపాక్ కంబా లప్ (KKL) అనే సంస్థ ఆగ్రహించింది. ఈ మేరకు ఆమెను సినిమాలకు దూరంగా ఉంచాలని, కనీసం సినిమా కార్యక్రమాల్లో కూడా ఆమె భాగం కాకూడదని ఆదేశించింది. ఈ మేరకు మణిపుర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు కేకేఎల్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
సోమ ఇప్పటివరకు 150 మణిపురీ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. అలా ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగిన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌కు సోమ హాజరైంది. ఆ ఈవెంట్‌కు షో స్టాపర్‌గా కూడా వ్యవహరించింది. ఈ క్రమంలో మణిపూర్ ప్రస్తుత పరిస్థితులు, అక్కడ జరుగుతున్న విధ్వంసాల గురించి స్పీచ్‌లో చెప్పింది. మణిపూర్‌లో శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని కూడా అంది.
అయితే ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు తనపై (Actress) నిషేధం విధించాం అంటున్న వాళ్లకు సోమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమూ చేసింది. నిజానికి తాను పాల్గొన్నది ఫ్యాషన్ షో కాదని, అది ఓ కల్చరల్ ప్రోగ్రామ్ మాత్రమే అని చెప్పింది. మై హోమ్ ఇండియా అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అది అని చెప్పింది. అందులో నాగాలాండ్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పాల్గొన్నాయని చెప్పింది. మణిపూర్ నుండి తాను హాజరయ్యాను అని చెప్పింది. అయితే ఈ విషయంలో సోమకు పరిశ్రమ నుండి బాగానే సపోర్టు వస్తోంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!