నటుడితో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన నటి!

సినిమా వాళ్ళు ప్రేమ, డేటింగ్ అంటూ తిరగడం.. కుదిరితే పెళ్లి చేసుకోవడం లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం వంటివి కొత్త వ్యవహారాలు ఏమీ కాదు. అలాగే పెళ్ళైనప్పటికీ.. కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది కొంచెం డిఫరెంట్. విషయం ఏంటంటే.. ఓ బుల్లితెర నటి గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తక్కువ టైంలోనే అతనితో విడాకులు తీసుకుంది. ఆమె మరెవరో కాదు నివేదిత పంకజ్.

గతంలో ఈమె సీరియల్ నటుడు ఎస్.ఎస్.ఆర్యన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళు క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. కానీ కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. ఇది అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అయితే 3 ఏళ్ళ తర్వాత నివేదిత పంకజ్.. మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు చెప్పి అందరికీ మరో షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. విషయంలోకి వెళితే.. బుల్లితెర నటుడు సురేందర్ ను ఈమె ప్రేమిస్తుందట.

త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతుందట. అతనితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి ‘మీ అనుమానాలు, ప్రశ్నలకి క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను’ అంటూ పేర్కొంది ఈ బ్యూటీ. ఇక ఈమె మాజీ భర్త ఎస్.ఎస్.ఆర్యన్ కొన్నాళ్ల క్రితం మరో సీరియల్ నటి శ్రీతిక సనీష్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు (Nivedhitha Pankaj) నివేదిత పంకజ్ కూడా నూతన జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది అని స్పష్టమవుతుంది

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus