సిద్ధార్థ్ (Siddharth) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తమిళంలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు సిద్దార్థ్. అవి అక్కడ బాగానే ఆడుతున్నా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవి రుచించడం లేదు. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘3 BHK’ ఈ జూలై 4న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. శరత్ కుమార్, దేవయాని వంటి స్టార్స్ నటించడం సినిమాకి ఓ అట్రాక్షన్ అయ్యింది. కాన్సెప్ట్ కూడా అందరికీ రిలేట్ అయ్యేలా ఉండటం వల్ల.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మొదటి రోజు అంతగా వసూళ్ళు రాలేదు కానీ రెండో రోజు బెటర్ అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.27 cr |
సీడెడ్ | 0.05 cr |
ఆంధ్ర(టోటల్) | 0.25 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.57 cr (షేర్) |