దయనీయమైన స్థితిలో సీనియర్ నటి.. రోజులు లెక్కపెడుతున్నాను అంటూ ఎమోషనల్..!

సినిమా వాళ్ళ జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయి అనేది ఓ అపోహ మాత్రమే. చెప్పాలంటే సామాన్యుల కంటే కూడా వీళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. వీళ్ళు టైంని లెక్కచేయకుండా, ఎండా, వానా, చలి వంటి వాటిని లెక్క చేయకుండా పని చేయాలి. వీళ్లకు షూటింగ్ లు కనుక లేవు అంటే ఎటువంటి ఇన్కమ్ ఉండదు. ఒకవేళ ఇన్కమ్ సంబంధించిన కేరక్టర్ ఆర్టిస్టులలో ఝాన్సీ ఒకరు. 70 … 80 దశకాలలో ఆమె చాలా సినిమాల్లో నటించారు. విలన్ కి ఉన్నా… దానిని మళ్ళీ సినిమాల్లోనే పెట్టి…

మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహానటి సావిత్రి లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ఇక ఐరన్ లెగ్ వంటి కమెడియన్ చనిపోయినప్పుడు దహన కార్యక్రమాలకు కూడా వారి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేవు అంటే.. వాళ్ళ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో సీనియర్ నటి పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఒకప్పుడు విలాసవంతమైన బంగ్లాల్లో జీవించిన ఆ సీనియర్ నటి ఇప్పుడు అద్దింట్లో ఉంటూ..

కనీసం అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. ఆమెనే సీనియర్ నటి ఝాన్సీ. ‘పెళ్లి పుస్తకం’ ‘మనవూరి పాండవులు’ ‘యమగోల’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. మొత్తంగా 300 కి పైగా సినిమాల్లో ఈమె నటించింది. అయితే సొంతంగా సినిమాలు నిర్మించి కూడబెట్టిందంతా కోల్పోయిందట. ఆమె మాట్లాడుతూ .. “30 ఏళ్ల క్రితం మేము చెన్నైలో ఉండేవాళ్లం. ఇండస్ట్రీ హైదరాబాదుకి రావడంతో మేము కూడా ఇక్కడికి వచ్చేశాం. అయితే ఇక్కడికి వచ్చాక నాకు అవకాశాలు దొరకలేదు.

అప్పుడు మా వారు సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి హీరో సుమన్ తో ‘ఖైదీ ఇన్ స్పెక్టర్’ సినిమాను నిర్మించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాగానే ఆడినా డబ్బులు మా వరకు రాలేదు. ఆ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న ఇళ్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తులు పోయినందుకు నేను పెద్దగా బాధపడలేదు. కానీ ఆ తర్వాత మా వారు చనిపోయారు. ఇద్దరు మగ పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. కోడళ్లు వచ్చి వాళ్లను తీసుకుని పోయారు. ఆర్థికంగా కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ రోజులు నెట్టుకొస్తున్నాను” అంటూ ఆమె తెలిపారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus