ప్రియుడితోనే ప్రాణాలు కోల్పోయిన నటి!

సినిమా ఇండస్ట్రీలో మరో విషధం చోటు చేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుజున్న ఇద్దరు సెలబ్రెటీలు యాక్సిడెంట్ లో మృతి చెందిన ఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. బాగా-కలాంగుట్‌ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోపోవడంతో ప్రమాదం జరిగింది. అందులో ఉన్న నటిమణి అలాగే ఆమె ప్రియుడు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఈశ్వరి దేశ్‌ పాండే

తన ప్రియుడితో కలిసి ఈ నెల 15న గోవా హాలీడే ట్రిప్‌కు ఎంతో సంతోషంగా వెళ్లింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి దగ్గర్లో ఉన్న బాగా-కలాంగుట్‌ బ్రిడ్జ్ పై ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దురదృష్టవశాత్తు కారు సెంట్రల్‌ లాక్‌ చేసి ఉండటంతో వలన 25 ఏళ్ల ఈశ్వరితో తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) కూడా కారులోనే తుది శ్వాస విడిచారు. ఈశ్వరి దేశ్‌ పాండే హిందీ, మరాఠీ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు అందుకుంది.

ఇక నెల రోజుల్లో ప్రీయుడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని అనుకున్న ఈశ్వరి ఊహించని విధంగా కాబోయే భర్తతోనే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మరాఠీ ఇండస్ట్రీలో అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus