Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

నచ్చినోడు చేస్తే ఫన్‌.. నచ్చనోడు చేస్తే క్రింజ్‌.. నచ్చిన వ్యక్తి డైరెక్ట్‌ చేస్తే కామెడీ.. నచ్చని వ్యక్తి డైరెక్ట్‌ చేస్తే క్రింజ్‌.. టాలీవుడ్‌లో ట్రోలింగ్‌ బ్యాచ్‌ గత కొన్నేళ్లుగా చేస్తున్న పని ఇదే. ఒకే సీన్‌ని ఇద్దరు హీరోలు చేసినప్పుడు ఒక హీరో సినిమాను లేపి.. మరో హీరో సినిమాను తొక్కేద్దాం అని కలలు కంటుంటారు. ఇలాంటి వారికి ప్రముఖ దర్శకుడు క్రింజ్‌ కామెంట్లు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటూ.. దూసుకుంటూ పోతున్న అనిల్‌ రావిపూడి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. తాను సృష్టించిన ఓ పాత్ర వెనుక కారణం గురించి చెప్పుకొచ్చారు.

Anil Ravipudi

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బులిరాజు పాత్రకు ఫుల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. మా ఇంట్లోనూ ఇలాంటి బుడ్డోడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నారంతా. కొందరైతే ఇదేంటి పిల్లాడితో ఇలాంటి మాటలు ఆడిస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదు అని అనుకున్నారు. ఇంకొందరైతే ఇది క్రింజ్‌ కామెడీ అంటూ కత్తులు నూరారు. ఈ పాత్రపై అనిల్‌ రావిపూడి స్పందించారు. ఓ మీడియాతోపాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రింజ్ అనే ప‌దం నాతో కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర‌హాలో ఇంకో ప‌ది సినిమాలు ఇచ్చినా న‌న్ను క్రింజ్ డైరెక్ట‌ర్ అనే అంటారు అని లైట్‌ తీసుకున్నారాయన.

అయితే ఈ మాటలు అనేవాళ్లు వందలో ప‌ది శాత‌మే ఉంటారు. మిగ‌తా 90 శాతం మంది ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు టికెట్లు కొంటున్న‌పుడు నేను ఆ ప‌ది శాతం గురించి ఎందుకు ఆలోచించాలి? అని ప్రశ్నించారు. ఇక బులిరాజు పాత్రను దివంగత ప్రముఖ దర్శకుడు జంధ్యాల తీసిన ‘హై హై నాయ‌కా’ సినిమా నుండి స్ఫూర్తి పొంది రాసుకున్నాను అని చెప్పారు. అంతేకాదు అలాంటి పిల్లాడు ఒకడు తన ఇంట్లోనే ఉన్నాడని.. వాడు తన కొడుకే అని చెప్పారు అనిల్‌. మా వాడిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్పారు. ఇలాంటి పిల్లల విషయంలో పెద్దవాళ్లకు హెచ్చరికలా ఉండాలని ఆ పాత్ర రాసినట్లు చెప్పారు.

‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus